400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పిన వారు ఆ పార్టీలో ఉన్నారు. తెర వెనుక దాగి ఉన్న వ్యూహాన్ని కొంత మంది BJP నాయకులు ఉండబట్టలేక బయటకు చెప్పేశారు. RSS మొదట్నుంచీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉంది. రాజ్యాంగం.. వర్ణ వ్యవస్థను రిజెక్ట్ చేసింది. మనుషులందరికీ సమాన హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పింది. ఈక్వాలిటీ అన్న పదమే RSSకు నచ్చదు. సహజంగానే రాజ్యాంగమూ నచ్చదు.
BJP ప్రత్యర్థులు పాలిస్తున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టి.. పాలన సరిగా జరకుండా చేయడానికి గవర్నర్ల వ్యవస్థను కుట్ర పూరితంగా వాడుకోవడాన్ని కొనసాగించాలనమాట. అందుకే రాష్ట్రపతికి గడువు పెట్టకూడదు అని అంటున్నారు.